సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (17:45 IST)

ఈ నెల 23న విడుద‌ల‌వుతోన్న కుట్ర‌ ద గేమ్‌ స్టార్స్‌ నవ్‌

Kutra prerelase
Kutra prerelase
ప్రీతి, గీతిక రతన్‌, ప్రియ దేశ్‌పాల్‌ హీరోయిన్లుగా  స‌స్పెన్స్  క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం  ‘కుట్ర’ (ద గేమ్‌ స్టార్స్‌ నవ్‌ ట్యాగ్‌లైన్‌). సిరి ఎంటర్టైన్‌మెంట్స్‌ పతాకంపై సిరిపురం రాజేష్‌ డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తూ  స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రంఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబ‌ర్ లో  ప్రీ-రిలీజ్ ఏర్పాటు చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా కోలేటి దామోద‌ర్ మాట్లాడుతూ...``సిరిపురం రాజేష్ అడ్వ‌కేట్ గా, వ్యాపారవేత్త‌గా , జ‌ర్న‌లిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. నాకు మంచి మిత్రులు, ఆయ‌న న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా నిర్మించ‌డం గొప్ప విష‌యం. సినిమా చూశాము. అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా విజ‌యవంతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
 
 ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ...``ప్ర‌స్తుతం స‌మాజంలో ప్ర‌తి విష‌యంలో కుట్ర‌లే జ‌రుగుతున్నాయి. అలాంటి టైటిల్ తో ఓ చ‌క్క‌టి చిత్రాన్ని తెర‌కెక్కించిన రాజేష్ గారికి ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించాల‌న్నారు.
 
 అమ‌ర‌వాది లక్ష్మినారాయ‌ణ మాట్లాడుతూ...``రాజేష్ గారు జ‌ర్న‌లిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎంతో జోరుగా పాల్గొన్నారు. అడ్వ‌కేట్ గా కూడా మంచి పేరుంది. క‌రోన టైమ్‌లో సిరిపురం రాజేష్ గారు షార్ట్ ఫిలింస్ చేశారు. ఎప్ప‌టికైనా సినిమా చేయాల‌ని చెప్పేవాడు. కానీ ఇంత త్వ‌ర‌గా సినిమా చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు అనుకోలేదు. ఈ సినిమా విడ‌దులై ఆయ‌న‌కు మంచి పేరు, లాభాలు తేవాల‌న్నారు.
 
 నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...``సిరిపురం రాజేష్ గారు న‌టిస్తూ, స్వీయ ద‌ర్వ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌క‌క్కించారు. పాట‌లు, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంటే ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. కుట్ర అనే క్యాచీ టైటిల్ తో ఒక మంచి కాన్సెప్ట్ తో వ‌స్తోన్న ఈచిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...``కుట్ర ` ట్రైల‌ర్, సాంగ్స్ చాలా బావున్నాయి. సిరిపురం రాజేష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ  చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.ఈ చిత్రం ఘ‌న విజయం సాధించాల‌న్నారు.
 
 న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ సిరిపురం రాజేష్ మాట్లాడుతూ...`` మంచిర్యాల లో 1985 నుండి నేను జ‌ర్న‌లిస్ట్ గా  పనిచేశాను. `కుట్ర‌` నా తొలి సినిమా. ఇద్ద‌రి మిత్రుల మ‌ధ్య న‌డిచే స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్  చిత్ర‌మిది. ఈ నెల 23న దాదాపు 100 థియేట‌ర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.  
 ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఏ. వెంక‌టేష్‌, మంచాల ర‌ఘువీర్‌, , కాచెం స‌త్య‌నారాయ‌ణ‌, సిరిపురం స‌త్య‌నారాయ‌ణ‌, ముక్త శ్రీనివాస్ , ఎమ్ , సురేంద్ర‌నాథ్ రెడ్డి , మాదం శెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, కొండా చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు.