గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (18:48 IST)

ప్రీతి ఆత్మహత్య.. వరంగల్ పోలీసులకు ఫోరెన్సిక్ రిపోర్ట్

medico preethi
తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
 
తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. ఇవాళ దీనికి కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరంగల్ పోలీసులకు అందింది. 
 
గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ఆధారంగా ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్ సిద్ధం అయ్యింది.  ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్టును కూడా పోలీసులు తీసుకున్నారు. దీంతో నేడు ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు బయటపెట్టే అవకాశముంది.