1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 18 ఆగస్టు 2022 (17:34 IST)

‘గోరంట్ల మాధవ్ వీడియో’ ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై ఏపీ సీఐడీ ఏమన్నారు?

AP CID
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎవరితోనో మాట్లాడుతున్న న్యూడ్ వీడియోగా ప్రచారంలో ఉన్న దానిని నిర్ధారిస్తూ అమెరికాకి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని సాగుతున్న ప్రచారం వాస్తవం కాదంటూ ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అన్నారు. వీడియో కాల్‌లో మాట్లాడుతున్న ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి ఫోన్ నుంచి ఒరిజినల్ వీడియో లభిస్తే తప్ప దానిని నిర్ధారించడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గతంలో చెప్పిన మాటలను సునీల్ కుమార్ మరోసారి గుర్తుచేశారు.

 
కొంతమంది వ్యక్తులు తప్పుడు రిపోర్ట్‌ను ప్రచారం చేస్తున్నారనే అంశంపై వివరాలు కోరుతూ ప్రభుత్వం ఆదేశించడంతో తాము అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్‌ను సంప్రదించినట్టు సునీల్ కుమార్ తెలిపారు. ఆ ల్యాబ్ తరపున జిమ్ స్టాఫర్డ్ పంపించిన ఇ-మెయిల్‌ను మీడియాకు అందించారు. ఆ వీడియో కాల్ ఒరిజినల్ అంటూ చెబుతున్న సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని తేల్చినట్టు సునీల్ కుమార్ వెల్లడించారు. ఏ వీడియో అయినా ఒరిజినల్ ఉంటే తప్ప ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ లోనూ నిర్ధారణ జరగదన్నారు.

Email
‘ఈ కేసులో పోతిని అనే వ్యక్తి నన్ను రిపోర్ట్ మార్చమని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకముందే దాన్ని ప్రచారంలో పెట్టారు’ అని జిమ్ స్టాఫర్డ్ వెల్లడించారని సునీల్ అన్నారు. నిపుణుల నివేదికను ఏమాత్రం మార్చినా అది చెల్లుబాటు కాదు అని ఆయన అన్నారు. ఐటీ యాక్ట్, ఐపీసీ కింద కొన్ని నేరాలు జరిగినట్టు నిర్ధారణ జరిగింది. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.