మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (10:43 IST)

అమ్మ ఒడిపై నకిలీ ట్వీట్ షేరింగ్ - టీడీపీ మహిళా నేతకు నోటీసులు

gouthu sirisha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నేత గౌతు శిరీషకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిదని, ఈ యేడాది ఆ రెండు పథకాలకు డబ్బులు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ పోస్టును ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ నకిలీ పోస్టును పెట్టిన వారిని వదిలివేసి.. దాన్ని షేర్ చేసిన టీడీపీ మహిళా నేత శిరీషకు సీఐడీ పోలీసులు ఇపుడు నోటీసులు పంపించడం గమనార్హం. 
 
పైగా, సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని అందులో కోరారు. ఇదిలావుంటే, ఇదే తరహా ఆరోపణలపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీసీ కోఆర్డినేటర్ అప్పిని వెంకటేష్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయన వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి పంపించి వేశారు.