1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (15:04 IST)

జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ రూ.25లక్షల భారీ ఆర్థిక సాయం

టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా జంగ‌మ‌హేశ్వ‌ర‌పాడులో ప్ర‌త్య‌ర్థుల దాడిలో టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
కాగా పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌న్న దిశ‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
జ‌ల్ల‌య్య కుటుంంబానికి పార్టీ త‌ర‌ఫున‌ రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించారు. 
 
అదే స‌మ‌యంలో జ‌ల్ల‌య్య‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని పుల్లారావు డిమాండ్ చేశారు. జ‌ల్ల‌య్య కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని ఆయ‌న కోరారు.