మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:41 IST)

ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

preethi - saif
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరంగల్‌లో సీనియర్ వైద్యుడు సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ నేపథ్యంలో డా. సైఫ్‌కు రూ. గ్యారెంటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేశారు. ఇంకా వచ్చే 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే విచారణ సందర్భంగా బెదిరింపులకు పాల్పడినా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. 
 
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గతంలో నిర్ధారించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.