బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:15 IST)

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మళ్లీ షాక్.. తీర్పు సోమవారానికి వాయిదా

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పటికే తెలంగాణలో విడుదలైంది. కోర్టు తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విడుదలకు బ్రేక్ పడింది. వర్మ తనదైన శైలిలో ఈ సినిమాకు హైప్ తీసుకురావడం, ఏపీ సీఎం చంద్రబాబుని ఈ చిత్రంలో విలన్‌‍గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్  తెచ్చాయి. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. 
 
అయితే ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఓ వర్గానికి సంబంధించిన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలపై ఈ చిత్రం ప్రభావం చూపిస్తుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో... చిత్రాన్ని ఏపీ హైకోర్టు ఛాంబర్‌లో జడ్జిల కోసం ప్రదర్శించారు. సినిమాను చూసిన తర్వాత... తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో దర్శకనిర్మాతలు నిరాశకు గురయ్యారు.