సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (14:28 IST)

ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు..? ఎందుకు..? అంటోన్న వర్మ (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి మరో పాటను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జయసుధ, జయప్రద, శ్రీదేవి.. వీళ్లందరినీ వదిలీ ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు..? ఎందుకు..? అంటూ సాగే పాట టీజర్‌ను  ట్విట్టర్ ద్వారా వర్మ విడుదల చేలారు. ఈ పూర్తి సాంగ్ 8వ తేదీ సాయంత్రం విడుదల కానుంది. 
 
ఈ పాటలోని ప్రశ్నల వెనుక.. అబద్ధాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం అంటూ.. వర్మ వాయిస్ వుంది. 
 
ఇటీవల ''వెన్నుపోటు'' పాట విడుదల చేసి.. టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న వర్మ..  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం ముంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించబోతున్నారు.