గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (12:08 IST)

డీ గ్లామర్ లుక్‌లో విరాట్ కోహ్లీ భార్య

బాలీవుడ్ నటి అనుష్క శర్మ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈమె ఇటీవల వివాహం చేసుకుంది. హనీమూన్ తర్వాత స్వదేశానికి చేరుకున్న ఈ కొత్త దంపతులు ఇపుడు ఎవరి పనుల్లో వారు బిజిబిజీగా గడుపుతున్నారు

బాలీవుడ్ నటి అనుష్క శర్మ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈమె ఇటీవల వివాహం చేసుకుంది. హనీమూన్ తర్వాత స్వదేశానికి చేరుకున్న ఈ కొత్త దంపతులు ఇపుడు ఎవరి పనుల్లో వారు బిజిబిజీగా గడుపుతున్నారు. కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనలో ఉంటే, అనుష్క తన కొత్త ప్రాజెక్టు "సుయి ధాగా"లో బిజీగా ఉంది. 
 
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి శరత్ కఠారియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రల కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకుంటే, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది. 
 
ఇటీవలే అనుష్క ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న ఫోటోను చిత్ర నిర్మాత సంస్థ షేర్ చేసింది. తాజాగా చిత్రంలో అనుష్కకి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. డీ గ్లామర్ లుక్‌లో చీర కట్టుకొని ఉన్న అనుష్క శర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.