గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (16:54 IST)

పాట‌ల‌ ఆద‌ర‌ణ పొందిన లెహరాయి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది

Maddireddy Srinivas, Ghantadi Krishna, Ramakrishna Paramahamsa, Vasishtha, Ranjith
Maddireddy Srinivas, Ghantadi Krishna, Ramakrishna Paramahamsa, Vasishtha, Ranjith
మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి.  జీకే (ఘంటాడి కృష్ణ) సంగీతం స‌మ‌కూర్చిన ఇందులోని పాట‌లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. గురువారంనాడు చిత్ర టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో బింబిసార దర్శకుడు వశిష్ఠ ఆవిష్క‌రించారు. రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా న‌టించారు. రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పకులు.
 
టీజర్ అనంతరం బింబిసార దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..టీజర్ చాలా బాగుంది. శ్రీనివాస్ గారు చక్కటి  సినిమా తీశారు. దర్శకుడికి  మెదటి సినిమా ద్వారా ఎంత టెన్షన్ పడతాడో తర్వాత అంత ఎంజాయ్ చేస్తాడు.నా స్కూల్ డేస్ లో ఘంటాడి గారి పాటలు వినేవాన్ని ఈ సినిమాకు కూడా మంచి పాటలు అందించాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది తను కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్  హిట్ అవ్వాలి అన్నారు.
 
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ  మాట్లాడుతూ.. ఇందులోని పాటలకు  ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోని ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటాయి.ఆడియో కంటే  సినిమా చాలా బాగుంటుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించాడు. చాలా రోజులు తర్వాత మంచి  ఫీల్ గుడ్ స్టోరీ తో మంచి మెసేజ్ తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సినిమాలో మంచి కంటెంట్ ఉంది.ఈ చిత్రం ద్వారా తల్లి తండ్రులకు ,యువతీ, యువకులకు విద్యార్ధి విద్యార్థినిలకు,సమాజానికి ఒక  మంచి సందేశాన్ని ఇచ్చాము అనుకుంటున్నాము అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస  మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చింది. పక్కా హిట్ కొట్టబోతున్నాం. ఇది నా ఒక్కరి కష్టం కాదు. నిర్మాత శ్రీనివాస్ బెక్కం వేణుగోపాల్ సపోర్ట్ తో అలాగే నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అన్నారు.
 
హీరో రంజిత్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని కథlo చాలా ఎమోషన్స్ ఉంటాయి..ఇందులో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఘంటాడి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు 
నటి సంధ్య జనక్ మాట్లాడుతూ..చాలా రోజుల తర్వాత  మంచి స్టోరీ తో, మంచి కథతో వస్తున్న ఈ మూవీలో నేను మదర్ రోల్ లో సీనియర్ నరేష్ తో చేశాను. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.