'గ్యాంగ్ లీడర్'పై ఆశలు పెట్టుకున్న మేఘా ఆకాశ్
మేఘా ఆకాశ్.. నితిన్‌కి జంటగా చేసిన రెండు సినిమాలూ పరాజయం పొందడంతో వెనుకబడిపోయిన హీరోయిన్ ఇప్పుడు కొత్తగా గ్యాంగ్ లీడర్‌పై ఆశలు పెట్టుకుంది.
వివరాలలోకి వెళ్తే.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానీ కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' తెరకెక్కుతన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా... తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుపుకుంటోంది. త్వరలో మొదలుకానున్న ఈ తదుపరి షెడ్యూల్‌లో మేఘా ఆకాశ్ చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోండగా మరో కథానాయికగా మేఘా నటించనుందట.
ఇప్పటికే... నితిన్‌తో చేసిన రెండు సినిమాలూ పరాజయం కావడంతో తెరమరుగైన ఈ చిన్నది, నానీ సినిమాపైనే తన ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా అయినా హిట్ అయితే తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశపడుతోన్న ఈ అమ్మాయి ఆశ ఎంత మేరకు నెరవేరుతుందేమో మరి వేచి చూడాలి. అయితే... ప్రియాంక అరుళ్‌కి తెలుగులో ఇది తొలి సినిమా ఇదే. కాగా.. 'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనుండటం మరో విశేషం.