శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (17:28 IST)

మహిళల్ని అర్థం చేసుకునే కథే లవ్ గురు : విజయ్ ఆంటోనీ

Vijay Antony - Mrinalini Ravi -Vinayak Vaidyanathan
Vijay Antony - Mrinalini Ravi -Vinayak Vaidyanathan
విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా "లవ్ గురు". ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న  విడుదల చేయబోతున్నారు. ఇవాళ "లవ్ గురు" సినిమా ప్రెస్ మీట్ ను  హైదరాబాద్ లో నిర్వహించారు.
 
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ "లవ్ గురు" సినిమా చూస్తే గర్ల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు. ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు స్టేట్స్ లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో "లవ్ గురు" సినిమాను విడుదల చేయబోతున్నాం. నేను ఇప్పటిదాకా 12-13 సినిమాలు చేస్తే వాటిలో 8-9 సినిమాలకు భాష్యశ్రీ గారు వర్క్ చేశారు. బిచ్చగాడు సినిమా నుంచి ఆయన నాతో ట్రావెల్ చేస్తున్నారు. కథలోని సందర్భాన్ని మరింత అందంగా రాస్తారు. హీరోయిన్ మృణాళిని రవి తన క్యారెక్టర్ ను బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేసింది. ఏడాది పాటు టైమ్ తీసుకుని మా డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అంతే బాగా తెరకెక్కించారు. ఆయన యాక్టర్ కూడా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. లవ్ గురు చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని లేడీస్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మా సినిమాటోగ్రాఫర్ ఫరూక్, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. "లవ్ గురు" సక్సెస్ మీట్ లో మనమంతా మళ్లీ కలుద్దాం. అన్నారు.
 
డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ - శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు నేను డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేశాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మూడు నెలలు ఉన్నాను. ఆ టైమ్ లో తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఎంత విలువ ఇస్తుంది అనేది చూశాను. మా "లవ్ గురు" సినిమాతో ఇప్పుడు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. విజయ్ ఆంటోనీ గారి మూవీకి డైరెక్షన్ చేయడం ఒక మర్చిపోలేని విషయంగా భావిస్తాను. బిచ్చగాడు సినిమా తర్వాత అంతలా "లవ్ గురు" సినిమా కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ఈ సినిమా విజయ్ ఆంటోనీ గారికి 2.0 అనుకోవచ్చు. మనమంతా లవ్ ను ఒక్కోలా ఎక్స్ ప్రెస్ చేస్తాం. ఆయన తన పద్ధతిలో ఎక్స్ ప్రెస్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం విజయ్ గారికి కొత్త. అన్నారు.
 
హీరోయిన్ మృణాలిని రవి మాట్లాడుతూ - "లవ్ గురు" సినిమాలో లీలా అనే క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన హీరో, ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. లీలా క్యారెక్టర్ లో నటించేందుకు నేను కలైరాణి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ పాత్రలో పర్ ఫెక్ట్ గా నటించేందుకు ఆ మేడమ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది. విజయ్ ఆంటోనీని ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్స్ లో చూశారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ గా చూస్తారు. అది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ గారికి గర్ల్ ఫ్యాన్స్ పెరుగుతారు. అలాగే రొమాంటిక్ స్క్రిప్ట్స్ కూడా చాలా వస్తాయి. నేను ఈ షూటింగ్ టైమ్ లో ఆయనను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో ఫన్ గా షూట్ జరిగింది. మా మూవీలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతాయి. నాకు ఈ మూవీ చేసే టైమ్ లో సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
పాటలు, మాటల రచయిత  భాష్యశ్రీ మాట్లాడుతూ - "లవ్ గురు" సినిమాకు మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు డైరెక్టర్ వినాయక్ గారు. ఆయన తప్పకుండా తెలుగులోనూ సినిమా చేస్తారు. ఇక్కడ వి.వి. వినాయక్ గారిలా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. "లవ్ గురు" సినిమాలో విజయ్ ఆంటోనీ గారికి కొత్తగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ గారిని మీరు చూడని విధంగా ఈ సినిమాలో ఉంటారు. ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి నేను చెప్పేదేముంది. ఈ సినిమాలో క్యారెక్టర్ లో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ మృణాళిని రవి మోడరన్ థాట్స్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఆమె కూడా ఆకట్టుకుంటుంది. "లవ్ గురు" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వినాయక్, హీరో విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే మూవీ అవుతుంది. అన్నారు.