మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (13:50 IST)

మహేశ్ బాబు ఆవిష్కరించిన భజే వాయు వేగం టైటిల్, ఫస్ట్ లుక్

Karthikeya Gummakonda
Karthikeya Gummakonda
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని తెలిపిన మహేశ్ బాబు..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.
 
"భజే వాయు వేగం" సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
 
"భజే వాయు వేగం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో క్రికెట్ బ్యాట్ తో హీరో కార్తికేయ పరుగులు పెడుతుండటం, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ "భజే వాయు వేగం" సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఫ్రెష్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.
 
నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు