ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (20:51 IST)

20 రోజులపాటు మహేష్‌ బిజీ... చెన్నైలో షూటింగ్ కోసం...

మహేష్‌ బాబు మరో 20 రోజులపాటు బిజీగా ఉంటున్నాడు. తన తాజా సినిమా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ గురువారం నుంచి చెన్నైలో జరుగుతోంది. దాదాపు 20 రోజులపాటు అక్కడే ఉంటారు. కీలక సన్నివేశా

మహేష్‌ బాబు మరో 20 రోజులపాటు బిజీగా ఉంటున్నాడు. తన తాజా సినిమా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ గురువారం నుంచి చెన్నైలో జరుగుతోంది. దాదాపు 20 రోజులపాటు అక్కడే ఉంటారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 
 
'బ్రహ్మోత్సవం' తర్వాత మహేష్‌బాబు చాలా జాగ్రత్తగా కథను ఎన్నుకుని చేస్తున్న చిత్రమిది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియదర్శిని పులికొండ, మహేష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. 
 
మహేష్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంటున్నాడు. 'పెళ్లిచూపులు' చిత్రంలో పొడుగ్గావుండే ఈ కుర్రాడు.. తెలంగాణ యాసతో పలుకరిస్తాడు. ఒక్క సినిమాతో ఏకంగా స్టార్‌ హీరోతో చేసే ఛాన్స్‌ను కొట్టేశాడు.