గల్లా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ హీరో.. క్లాప్ కొట్టిన హీరో కృష్ణా
తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండితెర హీరోగా పరిచయంకానున్నాయి. ఈయనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అదే నువ్వు.. అదే నేను అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శశి అనే దర్శకుడు కొత్తగా టాలీవుడ్‌కు పరిచయంకానున్నాడు. నభా నటాషా కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరుగగా, ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ,రాఘవేంద్రరావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి "అదే నువ్వు అదే నేను" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రానికి తొలిక్లాప్ కృష్ణ కొట్టారు. అతి త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్ళనుంది.
అశోక్ కొన్నాళ్ళుగా అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. అశోక్ చిత్రం శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. కాగా, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీతో సంబధం ఉన్న కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో అశోక్ గల్లా.