సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (11:40 IST)

కౌశల్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్... ఏంటది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్‌కి ప్రస్తుతం క్రేజ్ బాగా పెరిగిపోయింది. టైటిల్ గెలవడంతో పాటు బహుమతిగా పొందిన యాభై లక్షలను క్యాన్సర్ బాధితులకు డొనేట్ చేసి పెద్ద హీరోగా మారిపోయారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్‌కి ప్రస్తుతం క్రేజ్ బాగా పెరిగిపోయింది. టైటిల్ గెలవడంతో పాటు బహుమతిగా పొందిన యాభై లక్షలను క్యాన్సర్ బాధితులకు డొనేట్ చేసి పెద్ద హీరోగా మారిపోయారు. హౌస్‌లో ఉన్నప్పుడే కౌశల్ ఆర్మీ పేరుతో అతనికి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. 
 
113 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ షో ఒంటరిగా పోరాడి చివరిగా విన్నర్‌గా నిలిచారు కౌశల్. దీంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంటున్నారు. ఇంక ఇదే ఊపులో అనేక సినిమా అవకాశాలు ఇవ్వడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
 
బిగ్ బాస్ టైటిల్ స్వంతం చేసుకున్నాక బయట ఆర్మీ ఏర్పాటు చేసిన సంబరాలలో పాల్గొంటున్నప్పుడు తాను స్వంతంగా మోడలింగ్ అకాడెమీ ప్రారంభించినప్పుడు సూపర్ స్టార్ మహేష్ రిబ్బన్ కట్ చేసారని, ఎనలేని ప్రోత్సాహం అందించారని గుర్తు చేసుకున్నారు. తాజాగా టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్‌ని అభినందిస్తూ, నువ్వు టైటిల్ విన్ అవ్వడం సంతోషంగా ఉందంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఇది నిజంగా కౌషల్‌కు మర్చిపోలేని బహుమతి అని చెప్పవచ్చు. 
 
సూపర్ స్టార్ మాత్రమే కాకుండా కౌశల్‌కు టాలీవుడ్‌లోని అనేక మంది ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి ఇంకా చాలామంది కౌశల్‌కు అభినందనలు తెలిపారు. రామ్ చరణ్, బోయపాటి శ్రీను చిత్రంలో కౌశల్‌కు ఇప్పటికే అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవేకాకుండా ఇంకా పలు ఆఫర్లు అతని కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ క్రేజ్ బాగా పని చేస్తున్నట్లుంది మరి.