సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (14:22 IST)

హిందీలో భరత్ - ది గ్రేట్ లీడర్.. ట్రైలర్ రిలీజ్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా హిందీలో డబ్బింగ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా హిందీలో డబ్బింగ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. బాహుబలి సినిమాకు తర్వాత హిందీలోకి తెలుగు సినిమాలు బాగా డబ్ అవుతున్నాయి. 
 
తాజాగా భరత్ అనే నేను సినిమా హిందీలో భరత్-ది గ్రేట్ లీడర్ పేరుతో హిందీలో విడుదల కానుంది. ఇప్ప‌టికే మ‌హేష్ ప్ర‌తీ సినిమా అక్క‌డ అనువాదమవుతోంది. ఈ ట్రైలర్‌కు మంచి వ్యూస్ రావడంతో ఈ సినిమా హిందీ హక్కులు భారీగా పలికే అవకాశం వుందని టాక్ వస్తోంది. 
 
కాగా, మహేష్ కెరీర్‌లో భరత్ అనే నేను సినిమా ఈ ఏడాది బ్లా‌క్‌ బ్లస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డివివి దానయ్య నిర్మించగా, కైరా అద్వానీ కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.