శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (12:28 IST)

మా అన్నయ్య గౌతమ్ ఓ పెద్ద ఫ్యామిలీ గయ్ : మహేష్ డాటర్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార. చలాకీ పిల్ల. ప్రిన్స్ దంపతుల ముద్దుల కుమార్తె. మహేష్ మూవీ సెట్స్‌కెళ్లి అల్లరి పనులు, సందడి అంతాఇంతాకాదు. అంతేనా, అప్పుడప్పుడు త‌న తండ్రి సినిమాలోని పాట‌లు పాడ‌టం లేదంటే ఆ పాటలకు స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన తండ్రితో క‌లిసి డ్యాన్స్ చేయ‌గా, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 
 
ఇక తాజాగా సితార త‌న అన్న‌య్య గురించి ఓ వీడియోలో చెప్పింది. 'మా అన్నయ్య గౌతమ్ ఒక పెద్ద ఫ్యామిలీ గయ్' అని చెప్పింది. మహేష్ ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోను మహేష్ అభిమానులు షోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 
 
మ‌హేష్ ఇటీవ‌ల క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం త‌న ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ సానియా మీర్జా ఫ్యామిలీని కూడా క‌లిసి సంద‌డి చేశారు. మ‌హేష్ న‌టిస్తున్న "మ‌హ‌ర్షి" చిత్రం అతి త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ఏప్రిల్ 5వ తేదీన విడుద‌ల కానున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.