శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:40 IST)

భావన ఘటనపై దీపికా రెస్పాన్స్: ఆమె అనుభవించిన బాధ గురించి ఆలోచిస్తున్నా..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసుపై సెలెబ్రిటీలు సోషల్ మీడియాతో పాటు మీడియా ముఖంగా తమ స్పందనేంటో తెలియజేస్తున్నారు. భావన లైంగిక వేధింపుల కేసుపై విచారణ జరుగుతున్న

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసుపై సెలెబ్రిటీలు సోషల్ మీడియాతో పాటు మీడియా ముఖంగా తమ స్పందనేంటో తెలియజేస్తున్నారు. భావన లైంగిక వేధింపుల కేసుపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రముఖ నిర్మాత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భావన ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే మీడియాతో మాట్లాడారు. 
 
ఓ వ్యక్తిగా ఈ ఘటన తననెంతో భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. ఆమె వృత్తి గురించి తాను ఆలోచించట్లేదని.. ఆమె అనుభవించిన బాధ గురించి ఆలోచిస్తున్నానని చెప్పింది. భావన ఘటన బెంగళూరులో జరిగిన కొత్త సంవత్సర వేడుకలను తలపిస్తుందని దీపిక తెలిపింది. 
 
దోషులపై చట్టం కఠిన చర్యలు తీసుకోకపోతే మార్పు సాధ్యం కాదని.. తరచూ ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని దీపికా పదుకునే వెల్లడించింది. లైంగిక వేధింపులకు గురిచేసి.. శిక్ష నుంచి తప్పించుకుంటే.. మళ్లీ ఇలాంటి తప్పే చేస్తారని దీపిక వ్యాఖ్యానించింది.