ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (09:51 IST)

డిజైనర్ శారీ లుక్‌లో నాభి కేంద్రంపై ప్రతిఫలించిన ముత్యం...

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. ఈ పేరు సోషల్ మీడియాలోనే కాదు.. సినీ ఇండస్ట్రీలో కూడా మంచి సుపరిచితమే. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. అటు ప‌ర్స‌న‌ల్‌, ఇటు ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. 
 
ఈ క్ర‌మంతో త‌న‌పై ట్రోల్ వ‌చ్చిన‌, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. జూన్ 21న అంద‌రు యోగా డే మానియాలో ఉండ‌గా, ఆ రోజు మ్యూజిక్ డే కావ‌డంతో మంచు ల‌క్ష్మీ చీర‌క‌ట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. త‌న డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసిన మంచు వార‌మ్మాయి. వాత్తి కమింగ్ అంటూ సాగే పాటకు ఆమె నృత్యం చేసింది. 
 
అంతేకాకుండా, ఆ వీడియోలో 'పిచ్చిగా ఉండండి.. పిచ్చెక్కించండి.. ఎవరూ చూడనట్లు నృత్యం చేయండి!' అంటూ త‌న స్టైల్‌కి భిన్నంగా డ్యాన్స్ చేసింది. "డిజైనర్ శారీ లుక్‌లో నాభి కేంద్రంపై ప్రతిఫలించిన మంచి ముత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది". ఇక ఈ వీడియోపై ఎప్ప‌టిలానే ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.