సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (15:22 IST)

మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కూతురిని పక్కన పెట్టుకొని మద్యం..?

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు మంచు లక్ష్మీ తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి నెటిజన్స్ ఆగ్రహానికి కూడా గురి అవుతూ ఉంటుది. తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో లక్ష్మీ పెట్టిన ఫొటోని చూసి మంచు లక్ష్మీని ఏకిపారేస్తున్నారు.
 
కరోనా వలన కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమై ఉన్న మంచు లక్ష్మీ తన భర్త, కూతురుతో కలిసి పార్టీకి వెళ్లింది. ఆ పార్టీ ఫోటోలను షేర్ చేస్తూ.. చాలా కాలం తరువాత నా అభిమాన వ్యక్తులతో కొన్ని ఆహ్లాదకరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నా.. పాత రోజులు మళ్లీ రావడం హ్యాపీగా ఉంది అని పేర్కొంది. 
 
అయితే ఫొటోలలో మంచు లక్ష్మీ తన కూతురిని పక్కన పెట్టుకొని మద్యం సేవిస్తున్నట్టు కనిపిస్తుండగా, నెటిజన్స్ మండిపడుతున్నారు. పిల్లల ముందు ఇలా చేయోచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీపై పలు మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాగా మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుంటూ 2006లో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు సరోగసి ద్వారా నిర్వాణకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.