బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (12:52 IST)

వామికా ముఖాన్ని గట్టిగా అదిమి పట్టిన అనుష్క.. ఫైర్ అయిన నెటిజన్లు

Vamika
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ -అనుష్క  ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్‌ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్​లో ఉన్న టీమిండియా ప్లేయర్, స్టాఫ్​, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్​ బుధవారం రాత్రి ఇంగ్లండ్​ బయలుదేరారు.
 
ఈ మేరకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.