బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 మే 2021 (19:31 IST)

నాగ్‌, అనుష్క జంట రిపీట్ కానుందా!

nag-anuksha (file)
నాగార్జున‌, అనుష్క జంట‌గా ప‌లు సినిమాల‌లో న‌టించారు. తొలుత సూప‌ర్ సినిమాలో న‌టించిన ఆ జంట ఆ త‌ర్వాత దాదాపు `న‌మో వేంక‌టేశాయ‌` చిత్రం వ‌ర‌కు దాదాపు 9 సినిమాల్లో న‌టించారు. ఇప్ప‌డు మ‌ర‌లా వారిద్ద‌రి క‌ల‌యిక‌లో ప‌ద‌వ సినిమా రాబోతున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. నాగార్జున న‌టించిన చిత్రం `వైల్డ్ డాగ్`. క‌రోనా మొద‌టి వేవ్ త‌ర్వాత విడుద‌లైంది. ఆ సినిమాలో అనుష్క‌ను మొద‌ట అనుకున్న‌ట్లు స‌మాచారం. కానీ అనుష్క అందుకు స‌మ్మ‌తించ‌లేద‌ని తెలుస్తోంది. ఆమె కొంత‌కాలం ప్ర‌చారాల‌కు దూరంగా వుంది. తాను ఇప్పుడు ఏం చేస్తుందో కూడా చాలామందికి తెలీదు.
 
కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం జీరోసైజ్ సినిమా త‌ర్వాత ఆమె బాడీలో పూర్తిగా తేడా వ‌చ్చేసింది. అందుకు త‌గిన‌విధంగా డైట్ తీసుకుంటూ యోగా చేస్తూనే వుంది. కానీ సెట్ కావ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. 2019లో న‌టించిన `నిశ‌బ్దం` సినిమా 2020లో క‌రోనా టైంలో విడుద‌లైంది. అది కూడా ఓటీటీలోనే. ఆ సినిమా ఆమెకు పెద్ద‌గా లాభించ‌లేదు. ఆ త‌ర్వాత త‌ను ప్ర‌చారాల‌కు దూరంగా వుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఆమె బాడీని త‌గువిధంగా తీర్చిదిద్దార‌ని తెలిసింది. 
 
నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా త‌ర్వాత ఓ సినిమాను చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క ఓ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిచింది. అనుష్క ష్లాష్ బ్యాక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ క‌థకు చాలా కీల‌క‌మ‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. సో. మొద‌టిసారి అనుష్క‌ను ప‌రిచయం చేసిన నాగ్‌తోనే మ‌ర‌లా గేప్ త‌ర్వాత అనుష్క న‌టించ‌నుంది.