మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 మే 2021 (22:29 IST)

సింగం సిరీస్ సూర్యకే చెల్లింది.. ఆగస్టులో Singham 4.. స్వీటీ ఎంట్రీ!?

సింగం సిరీస్ సూర్యకే చెల్లింది. సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అలా సూర్య కెరీర్‌లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. 
 
కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడితే ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. సూర్య సరసన అనుష్క శెట్టి నటించనుందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం సూర్య సినిమాలు మూడు సెట్స్‌పై ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కరోనా కారణంగా ఆలస్యమైనవే. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంటున్నవే. ఈ మూడింటిలో వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్న 'వడివాసల్' పై సూర్య గట్టినమ్మకమే పెట్టుకున్నాడని అంటున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.