శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:07 IST)

హీరో సూర్యకు కరోనా పాజటివ్... క్షేమంగా ఉన్నట్టు ట్వీట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను కరోనాతో బాధపడుతున్నట్లుగా ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలని హీరో సూర్య ట్వీట్ చేశారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనాకు వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ.. ఆ టీకా సామాన్యుడి వరకు చేరే సరికి చాలా సమయం పడుతుంది కాబట్టి.. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని గ్రహించి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూర్య కోరారు. 
 
'నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా బారి నుంచి కోలుకుంటున్నాను. కరోనా విషయంలో జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని అందరూ గ్రహించాలి. భయంతో మనుగడ సాధించలేరు. అందుకే భద్రత, శ్రద్ధ అవసరం. వృత్తికి అంకితమై.. సేవలు అందిస్తున్న వైద్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.