మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (12:26 IST)

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 8 వేల మందికి అస్వస్థత?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తొలుత కోవిడ్ వారియర్లకు ఈ టీకాను అందజేశారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 44 ల‌క్ష‌ల మంది క‌రోనా టీకా వేశారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తేలింది. 
 
క‌రోనా టీకా తీసుకున్న వారిలో 37 ల‌క్ష‌ల మందిని సంప్ర‌దించ‌గా, ఆ టీకా ప్ర‌భావం గురించి 5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స్పందించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత 19 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు. 
 
అయితే వీరి మృతికి క‌రోనా టీకాతో ఎలాంటి సంబంధం లేద‌ని, ఇత‌ర జ‌బ్బుల కార‌ణంగానే చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 97 ల‌క్ష‌ల మంది హెల్త్ వ‌ర్క‌ర్స్ క‌రోనా టీకా తీసుకున్నారు. మొద‌టి ద‌శ‌లో క‌రోనా టీకా తీసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఈ నెల 13వ తేదీ నుంచి రెండో డోసు ఇవ్వ‌నున్నారు.