మూటలు మోసే కూలీగా మారిన హీరో మంచు మనోజ్.. ఎవరికోసం?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్‌గా మారాడు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో చెమటలు కారేలా మూటలు మోస్తూ కనిపించాడు. ఈయన మూటలు మోయడమేంటని అక్కడున్న
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్‌గా మారాడు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో చెమటలు కారేలా మూటలు మోస్తూ కనిపించాడు. ఈయన మూటలు మోయడమేంటని అక్కడున్నవారు బిత్తరపోయారు. కొందమంది ఇదేదో షూటింగ్ అనుకుని ఊరుకున్నారు. ఆ తర్వాత అది షూటింగ్ కాదని తెలిసి ఆశ్చర్యపోయారు. అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మి ''మేము సైతం'' పేరుతో ఓ సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పలువురు సెలెబ్రిటీల చేత వివిధ పనులు చేయిస్తూ నిధులు సేకరిస్తున్నారు. వచ్చి సొమ్మును కష్టాల్లో ఉన్న పేదలకు అందిస్తూ చేయూతనిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కోసం మనోజ్ కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ మూటలు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు.
మరోవైపు మంచు మనోజ్‌ను మూటలు మోయడం చూడ్డానికి పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతూ.. ఓ పేద కుటుంబానికి సాయం అందించేందుకు మూటలు మోయడం చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు.