శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (08:13 IST)

పరిస్దితి తేడా వస్తే గుడిసెకు వెళ్లాలంటే రెడీనా? ప్రణతిని అడిగిన మంచు

నేను ఆర్టిస్ట్‌ని. నాకు డబ్బు సేవ్‌ చేయడం రాదు. పరిస్థితుల్లో తేడా వస్తే ఇప్పుడున్న చిన్న అపార్ట్‌మెంట్‌ కూడా వదిలి గుడిసెలోకి వెళ్లాలంటే రెడీనా అని పెళ్లికాకముందే ప్రణతిని అడిగానని మోహన్‌బాబు తనయుడు

నేను ఆర్టిస్ట్‌ని. నాకు డబ్బు సేవ్‌ చేయడం రాదు. పరిస్థితుల్లో తేడా వస్తే ఇప్పుడున్న చిన్న అపార్ట్‌మెంట్‌ కూడా వదిలి గుడిసెలోకి వెళ్లాలంటే రెడీనా అని పెళ్లికాకముందే ప్రణతిని అడిగానని మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ చెప్పాడు. అందుకు నీతో ఎక్కడికైనా వస్తానని ప్రణతి చెప్పిందని ఆ తర్వాతే మా పెళ్లి జరిగిందని మనోజ్ తెలిపాడు. పైగా ప్రణతి మూవీ లవర్‌. ఓ ఫ్రెండ్‌లా సలహాలు ఇస్తుంది అని కూడా ప్రశంసలందించాడు. పెళ్లి తర్వాత నా లైఫ్‌లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు టైమ్‌కి ఇంటికి వెళ్తున్నాను. పెళ్లి విషయంలో నేను లక్కీ. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నా.
 
మంచు మనోజ్ హీరోగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్‌ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘చిన్నప్పట్నుంచీ డాడీ సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు చూస్తూ, పెరిగా. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అప్పుడు మేమంతా నాన్నగారి వెనకాలే ఉన్నాం.హిట్‌ వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఎన్ని కార్లున్నాయి ఫ్లాప్‌ టైమ్‌లో ఎన్ని ఆగాయనేది తెలుసు. ఆ వాతావరణంలో పెరిగినోళ్లపై జయాపజయాల ప్రభావం ఏముంటుంది’’ అన్నారు మంచు మనోజ్‌. 
 
‘గుంటూరోడు’ పక్కా హీరోయిజమ్‌ ఉన్న సినిమా. హీరోకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేడు. కళ్ల ముందు అన్యాయం జరిగితే వాడి చేతికి దురద వస్తుంది. సింపుల్‌ కథకు మాంచి యాక్షన్‌ జోడించి సత్య అద్భుతంగా తీశాడు. వెంకట్‌ సూపర్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. 
 
వాయిస్‌ ఓవర్‌ ఇవ్వమని ముందు రామ్‌ చరణ్‌ని అడిగా. తనప్పుడు వేరే ఊరిలో ఉన్నాడు. హైదరాబాద్‌ రావడానికి పది రోజులు పడుతుందన్నాడు. తర్వాతి రోజు చిరంజీవి అంకుల్‌ వాళ్లింటికి నాన్నగారు బ్రేక్‌ ఫాస్ట్‌కి వెళుతుంటే నేనూ వెళ్లాను. ‘అంకుల్‌.. నేనో మాస్‌ కమర్షియల్‌ సినిమా చేశా. మీరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాల’ని అడగ్గానే ఓకే చెప్పారు. మరుసటి దినం కాల్‌ చేసి ‘మను... డబ్బింగ్‌ చెప్పేశా. ఓసారి చూసుకో. కరెక్షన్స్‌ ఉంటే మళ్లీ చెబుతా’ అన్నారు. ఆయన చెప్తే కరెక్షన్స్‌ ఏముంటాయి! ‘చిన్న బిడ్డ కోసం వచ్చావు. నీకు పులి దొరికింది’ అని రామ్‌చరణ్‌ అన్నాడు అని చిరును ఆకాశంలోకి ఎత్తేశాడు మనోజ్