శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:00 IST)

హీరో నాని చిరకాల కోర్కె తీర్చిన చిరంజీవి.. సూపర్ గిఫ్టుతో సర్‌ప్రైజ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చిరకాల కోర్కె తీరింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సర్‌ప్రైజ్ గిఫ్టును అందుకున్నారు. దీంతో హీరో నాని ఉబ్బితబ్బిబ్బులైపోతున్నాడు. ఇంతకీ నాని కోర్కె ఏంటి.. చిరంజీవి ఇచ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చిరకాల కోర్కె తీరింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సర్‌ప్రైజ్ గిఫ్టును అందుకున్నారు. దీంతో హీరో నాని ఉబ్బితబ్బిబ్బులైపోతున్నాడు. ఇంతకీ నాని కోర్కె ఏంటి.. చిరంజీవి ఇచ్చిన బహుమతి ఏంటో ఓసారి పరిశీలిస్తే... 
 
సరిగ్గా పంతొమ్మిదిన్నర ఏళ్ల క్రితం ‘మాస్టర్‌’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోను చూడాలని చిరు వీరాభిమాని భావించాడు. అంతే... ఇంటి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ థియేటర్‌కు చేరుకున్నాడు. అక్కడకు వెళ్లి చూశాక... టిక్కెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... ఎలాగోలా క్యూలో నిలబడి ఎలాగోలా టిక్కెట్‌ సంపాదించాడు. తీరా బయటికొచ్చి చూస్తే తన హీరోస్‌ సైకిల్‌ని ఎవరో దొంగిలించారు. 
 
టిక్కెట్‌ దొరికిన ఆనందంలో సైకిల్‌ పోయినా పెద్దగా పట్టించుకోకుండా సినిమాను చూసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ యువకుడు ఆ సైకిల్‌ను తిరిగి పొందాడు. ఇంతకు ఆ యువకుడు మరెవరో కాదు. ప్రస్తుతం నాచ్యురల్‌ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాని. 
 
మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోకి నాని అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను చిరంజీవితో పంచుకున్నాడు. ఆ సమయంలో ‘మాస్టర్‌ సినిమా విడుదల రోజు తన సైకిల్‌ను ఎవరో దొంగిలించారన్న విషయాన్ని చిరుకు తెలిపారు. పైగా ఈ గేమ్‌షోలో గెలుపొందిన డబ్బుతో అప్పుడు పోగొట్టుకున్న సైకిల్‌ కొనుక్కుంటానని చిరుకు నాని చెప్పాడు. దీనికి మెగాస్టార్ కుదరదన్నాడు. 
 
‘నా సినిమా చూడటానికి వచ్చి సైకిల్‌ పోగొట్టుకున్నావ్‌ కాబట్టి ఆ సైకిల్‌ నేనే తీసిస్తాను’ అని చిరంజీవి మాటిచ్చారు. ఆయన అన్నట్లుగానే కొత్త సైకిల్‌ను నానికి పంపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో నాని పంచుకున్నారు. ‘‘ఆ కుర్రాడు తిరిగి సైకిల్‌ని దక్కించుకున్నాడు. షోలో మాటిచ్చిన ప్రకారం చిరంజీవిగారు ఈ సూపర్‌ కూల్‌ సైకిల్‌ పంపారు’ అని దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీసి ట్విట్టర్‌లో నాని ఓ కామెంట్ పోస్ట్‌ చేశారు.