మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్
Vikrant, Chandni Chowdhury, Madhura Sridhar Reddy, Nirvi Hariprasad Reddy
విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ ఇటీవల విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్‌ను తాజాగా గానా & రేడియో మిర్చి నిర్వహించిన మైండ్ స్పేస్ ఎకో రన్ లో ప్రదర్శించారు. ఈ టీజర్ ఎకో రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకుడు సంజీవ్ రెడ్డి, రైటర్ షేక్ దావూద్ జీ పాల్గొన్నారు.
ఈ చిత్రంలో హీరో విక్రాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో, టీజర్‌లో అతని క్యారెక్టర్‌ను చూసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమతో బాగా రిలేట్ అయ్యారు. ఈ ఈవెంట్‌ను గానా & రేడియో మిర్చి సౌత్ రీజనల్ కంటెంట్ డైరెక్టర్ వాణి మాధవి అవసరాల ప్లాన్ చేసి విజయవంతంగా నిర్వహించారు.
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.