శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (13:32 IST)

పార్లమెంట్‌ సభ్యులకు గద్దర్‌2 తో దేశభక్తి కల్గిస్తున్న మోదీ

gadar2 poster
gadar2 poster
పార్లమెంట్‌ సభ్యులకు రాజకీయాలు, దేశ సేవ మీదున్న టైం సినిమాలను చూడడానికి వుండదు. ఒకప్పుడు పి.వి. నరసింహారావు ప్రధానిగా వున్న తరుణంలో కొన్ని సినిమాలను అప్పుడప్పుడు చూసేవాడరు. అందులో భాగంగా రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూసినట్లు చెప్పారు కూడా. ఇప్పుడు మోడీ కూడా పార్లమెంట్‌ సభ్యులకు ఆటవిడుపుగా సినిమాను ప్రదర్శిస్తున్నారు. 22 ఏళ్ళనాడు సన్నీడియోల్‌ నటించిన గదర్‌కు సీక్వెల్‌గా గద్దర్‌ 2 విడుదలైంది. అన్నిచోట్ల రికార్డ్‌లు సృష్టిస్తోంది. అందుకే కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ సినిమాలు ప్రదర్శితున్నారు. 
 
ఇండియా, పాకిస్తాన్‌ కాన్సెప్ట్‌తో సోల్జర్‌ నేతృత్వంలో ఈ సినిమా కథ వుంది. ఇందులో 22 ఏళ్ళ నాడు నటించిన సన్నీ డియోల్‌, అమీషాపటేల్‌ కలిసి నటించడం విశేషం. లవ్‌ సిన్హా,  సిమ్రాత్‌ కౌర్‌, ఉత్కర్ష్‌ శర్మ తదితరులు నటించారు. అనిల్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శక్తిమాన్‌ తల్వార్‌ రచయిత. తాజాగా ఢిల్లీ పార్లమెంట్‌ హౌస్‌లో మూడు రోజులపాటు ఐదు ప్రదర్శనలు వేశారు.