మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (19:47 IST)

మోక్షజ్ఞను చూసి షాకైన నందమూరి ఫ్యాన్స్.. కారణం ఏంటి? (video)

Mokshagna
తాజాగా బాలకృష్ణ 60 పుట్టినరోజు వేడుకల్లో ఆయన తనయుడు మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ పర్సనాలిటీ చూసి ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. 
 
ఇక మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలంటే ముందుగా స్లిమ్‌గా మారాల్సిందే. దానికి ఎంత లేదన్నా ఇంకో యేడాది పట్టొచ్చు. ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టి విడుదలయ్యే వరకు ఎంత లేదన్నా.. 2022 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 25 ఏళ్లు.
 
ఇప్పటికే చాలామంది నట వారసులు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఒక బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన హీరోగా 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి.. 25 ఏళ్లకే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతిని నందమూరి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత ఇంత వరకు ఏ హీరో కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వలేదు.
 
నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో వచ్చిన పదిహేనేళ్లు కావొస్తోంది. అదే చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ నుంచి డజను పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ మెగా వారసుల ఎంట్రీ కొనగుతూనే ఉంది. అలాంటిది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడోనని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మరి మోక్షజ్ఞ బరువు తగ్గి సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో వేచి చూడాలి.