శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (20:34 IST)

రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ట్విట్టర్‌లో చిరంజీవి సర్జా (Video)

కన్నడ నటుడు, అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు చిరంజీవి సర్జా మృతికి తమ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆయనతో జ్ఞాపకాలని కొందరు నెమరువేసుకుంటున్నారు. తాజాగా చిరంజీవి సర్జా తన ప్రాణ స్నేహితుడు ప్రజ్వల్‌ దేవరాజ్‌తో ట్విట్టర్‌ వేదికగా జరిపిన చాట్‌కి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన ఈ సంభాషణలో రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ఫ్రెండ్స్‌తో కలిసి వారం టూర్‌ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను అని రాసాడు. 39 ఏళ్ళ వయస్సులో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. 2018లో మేఘనా రాజ్‌ని చిరంజీవి సర్జా వివాహం చేసుకోగా, ఆమె ప్రస్తుతం గర్భవతి కావడం గమనార్హం.