బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (18:18 IST)

రానా-మిహికాల వివాహం వాయిదా పడిందా? (video)

బాహుబలి భల్లాలదేవ, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా త్వరలో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే రానా-మిహీకాల నిశ్చితార్థం ఇప్పటికే జరిగిపోయింది. తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు ఇప్పటికే రానా ప్రకటించాడు. 
 
రానా తండ్రి సురేష్‌ బాబు కూడా ఈ విషయాన్ని కన్‌ఫాం చేస్తూ ఆగస్ట్‌ 8న పెళ్ళి ఉండనుందంటూ చిన్న హింట్ ఇచ్చారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో వివాహం ఆగస్ట్‌లో ఉంటుందని భావించారు. కాని తాజా సమాచారం ప్రకారం రానా- మిహీకాల వివాహం వాయిదా పడ్డట్టు తెలుస్తుంది.
 
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి వేడుకని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని రానా కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా నితిన్‌ కూడా తన పెళ్ళిని తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 
 
కొద్ది రోజుల క్రితం మిహీకా కుటుంబ సభ్యులు ముంబై నుండి హైదరాబాద్‌కి రాగా, రామానాయుడు స్టూడియోలో రోకా వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో రానా, మిహీకాలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి.