సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (13:38 IST)

క్లైమాక్స్‌ ఓవర్.. ఎన్ఎన్ఎన్‌తో వచ్చేస్తోన్న వర్మ.. అడల్ట్ కంటెంట్‌తో..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడల్ట్ కంటెంట్ వున్న సినిమాలకే అతుక్కుపోతున్నాడు. వివాదాలను వెతుక్కుంటూ పోయే వర్మ లాక్ డౌన్‌లో వుంటూ సినిమాలు తీస్తున్నాడు. అంతేగాకుండా మంచిగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. 
 
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన 'క్లైమాక్స్' సినిమాను తాజాగా ఆర్జీవీ వరల్డ్-శ్రేయాస్ మీడియా యాప్‌లో విడుదల చేశారు. ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. కోట్లు కొల్లగొట్టింది. ఆన్‌లైన్లో డబ్బులు వసూలు చేసింది.  
 
ఇప్పటికే క్లైమాక్స్‌తో యూత్‌కి కనెక్ట్ అవుతున్నవర్మ.. కరోనాపై ఓ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇప్పుడు తాజాగా నగ్నత్వంతో కూడిన 'ఎన్ఎన్ఎన్' చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. క్లైమాక్స్ మూవీ విడుదల టైంలోనే 'ఎన్ఎన్ఎన్' సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఓటీటిలో 'క్లైమాక్స్' చూసేందుకు 100 రూపాయల టికెట్ ఫిక్స్ చేసిన వర్మ 'ఎన్ఎన్ఎన్' సినిమాకు 200 రూపాయల టికెట్‌గా ఫిక్స్ చేశారు.
 
విదేశీ విమెన్ కన్నా ఇండియా విమెన్‌కు నేను చాలా వాల్యూ ఇస్తాను అంటూ వర్మ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో వర్మ చూపించిన సన్నివేశాలు వామ్మో అనేలా వున్నాయి. అడల్ట్ కంటెంట్‌తో ఈ ట్రైలర్ నిండిపోయింది. ఇప్పటికే ఈ ట్రైలర్ 11లక్షల వ్యూస్‌కి చేరువైంది.