మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (09:49 IST)

కియారా అద్వానీ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ నిర్మాతలు

కియారా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "భరత్ అనే నేను" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత రాం చరణ్ నటించిన "వినయ విధేయ రామ" చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అలాంటి కియారా అద్వానీ కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్‌లో కూడా ఆమె దూసుకెళుతోంది. అక్కడ కూడా వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. నిజానికి ఆమె సౌత్‌ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్ని వెబ్‌సిరీస్‌లలో కూడా ఆమె నటించింది. 
 
కానీ, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చాలా బిజీ అయిపోయింది. ఒకవైపు 'అర్జున్ రెడ్డి' రీమేక్ అయిన 'కబీర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో రెండు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది. 
 
వీటిలో ఒకటి "కాంచన" చిత్రం రీమేక్ కాగా, మరొకటి వుంది. వీటితో పాటు మరికొన్ని హిందీ, టాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ఈ అమ్మడు సమ్మతించింది. ఇతర స్టార్ హీరోయిన్ల పారితోషికంతో పోల్చితే ఈ భామ పారితోషికం తక్కువగా ఉంటుందని అందుకే ఆమెను తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది.