శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (18:26 IST)

సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ ఇక ఆంధ్ర‌ప‌దేశ్ ప్ర‌భుత్వం చేతిల్లోనే

Jagan
ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్నది. టికెట్ల బుకింగ్ పోర్టల్ ను ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షించనున్నది. దీని విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం  నియమించనున్నది. దీనికి సంబంధించిన జీ.ఓ.ను విడుద‌ల చేసింది. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో ఆన్‌లైన్ బుకింగ్ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయ‌ని తెలుస్తోంది.
 
Online g.o
ఏపీలోని జగన్ ప్ర‌భుత్వం ఇప్పటికే సింగిల్ విండో పధకం ద్వారా టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ మధ్య కరోనా సమయంలో టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను నొప్పి తెలియకుండా వసూల్ చేసేస్తున్నారు. టిక్కెట్ కు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకూ అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు. ఈ విష‌య‌మై ఇటీవ‌లే న‌ట్టికుమార్ కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లిఖిత‌పూర్వ‌కంగా విన్న‌వించారు. ఎ.పి. హైకోర్టుకూడా ఈ విషయాన్ని ప‌రిశీలించ‌మ‌ని కూడా వెల్ల‌డించింది.
 
ప్ర‌స్తుతం ఎ.పి. ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌ జీవోనూ జారీ చేసింది. నిజానికి ఇలాంటి వ్యవ్యస్థను తెలంగాణాలో తీసుకు రావాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కాగా. త్వ‌ర‌లో సినీ ప్ర‌ముఖ‌/ల‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అవి ఏమేర‌కు వుంటాయో తెలియాల్సివుంది.