శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (23:52 IST)

ప్రధాని పక్కన నా కుమారుడు అకీరా, నాకు ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?: రేణూ దేశాయ్ ఉద్వేగం

Renu Desai
రేణూ దేశాయ్. అకీరా నందన్ మాతృమూర్తి. తన కుమారుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన నిలబడి వుండటాన్ని చూసి తనకు చెప్పలేనంత ఆనందం, ఉద్వేగం కలిగిందని వెల్లడించారు రేణూ దేశాయ్. ఆమె మాటల్లోనే... '' నేను ఎప్పటి నుంచో బిజెపిని అభిమానించే వ్యక్తిని. ఈ రోజు భారతదేశ అద్భుతమైన ప్రధాని మోడీ గారు పక్కన ఉన్న నా కుమారుడు అకీరా నందన్ నన్ను చాలా ఉద్వేగానికి గురి చేసాడు.
 
దీని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. వ్రాయాలనుకుంటున్నాను, కానీ నా భావోద్వేగాలకు ఏ పదాలు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేసి, మన ప్రధాని గారి చుట్టూ ఏదో అయస్కాంత శక్తి ఉందని, ఆ గది అంతటా తన దృఢమైన వ్యక్తిత్వం, ఉనికిని తాను భావిస్తున్నానని చెప్పాడు.'' అని పేర్కొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)