సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (14:10 IST)

'ఇది నేనంటే నమ్మలేకపోతున్నాను'.. జానీ సినిమా వీడియో క్లిప్‌ను షేర్ చేసిన రేణూ దేశాయ్!

renu desai
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్.. తాను నటించిన చిత్రాల్లోని "జానీ" సినిమా వీడియో క్లిప్‌ను తాజాగా షేర్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్ నటించారు. ఈ చిత్రంలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన ఆమె.. ఈ వీడియో క్లిప్‌లో ఉన్నది నేనంటే నమ్మలేకపోతున్నా అంటూ కామెంట్స్ చేశారు. పైగా, తనక బర్త్‌డేకు కుమారుడు అకీరా నందన్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్యానించారు. అందమైన అ్మాయి అంటూ రెండు లవ్ సింబల్స్‌ను వీడియోకు జోడించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తమ హీరో మీద ప్రేమను ఇలా పరోక్షంగా వ్యక్తం చేశారంటూ కామెంట్స్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. 
 
కాగా, "బద్రి" సినిమాలో పవన్, రేణూ దేశాయ్‌లు నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మనస్పర్థల కారణఁగా పవన్, రేణూ విడాకులు తీసుకున్నారు. ఆపై పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకోగా, రేణు మాత్రం తన పిల్లల పెంపకంపై దృష్టిసారించి పెళ్లి చేసుకోలేదు. చాలాకాలం తర్వాత రవితేజ హీరోగా నటించిన "టైగర్ నాగేశ్వర రావు" చిత్రంలో రేణూ దేశాయ్ ఓ కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే.