శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (15:28 IST)

రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా.. పవన్‌కు రూ.40 కోట్ల ఆఫర్?

తెలుగు చిత్రపరిశ్రమలోని నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

తెలుగు చిత్రపరిశ్రమలోని నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలన్న యోచనలో ఉంది. ఇందులో హీరో రెమ్యునరేషన్‌గా రూ.40 కోట్లను ఇవ్వనుంది. 
 
నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని పవన్ భావిస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో మైత్రీ మూవీస్ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకురావడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారట. ఏం చేయాలన్న విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఒక వేళ పవన్ ఓకే చెబితే... దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా పవన్ రికార్డు సృష్టించనున్నారు.