శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (17:41 IST)

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

Kalyan Ram, NTR
Kalyan Ram, NTR
ఎన్.టి.ఆర్. నటించిన సినిమా దేవర ట్రెమండెస్ ఓపెనింగ్స్ వచ్చాయి. అర్థరాత్రి ఒంటిగంటకే షో మొదలైంది. రాత్రి కొరటాల శివ టీమ్ కు నిద్రపట్టలేదట. నైజాం డిస్ట్రిబూట్ చేసిన దిల్ రాజు ప్రత్యేకంగా హైదరాబాద్ లో థియేటర్ లో షో చూసి అక్కడ ఆదరణ చూశాక మనశ్శాంతిగా అనిపించిందట. ఈ విషయాన్ని నేడు సక్సెస్ మీట్ లో తెలియజేశారు. అయితే ఎన్.టి.ఆర్. అమెరికాలో వుండడంతో ఆయన్ను కలవలేకపోయాం. ఇండియా రాగానే కలిగి కంగ్రాట్స్ తెలియజేస్తామని  దిల్ రాజు అన్నారు. శుక్రవారం నిర్మాణ సంస్థ యువసుధ కార్యాలయంలో చిత్ర టీమ్ విజయోత్సవం జరుపుకున్నారు. 
 
కొరటాల శివ మాట్లాడుతూ, మూడేళ్ళ జర్నీ. రాత్రినుంచి నిద్రపోకుండా వెయిట్ చేశాం. సినిమాకు స్పందన వచ్చాక ఆనందం హద్దులు లేవు. అందరి విజయం ఇది. ఎన్.టి.ఆర్.తోపాటు అందరూ లేకపోతే సినిమా ఈ లెవెల్లో వచ్చేదికాదు. రాజుగారు నా లక్కీ. ఆయనే రిలీజ్ చేశారు అన్నారు.
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, రిలీజ్ ఓపెనింగ్స్ బాగున్నాయి. ఫ్యామిలీస్ వస్తున్నారు. దీనికి విప్లవ భావాలున్న కొరటాల శివ కారణం. ఆయనలో ఓ సహజత్వం వుంటుంది. దాన్ని దేవరలో చూపించే ప్రయత్నం చేశాడు. ఎన్.టి.ఆర్.కు బలమైన కథనుచెప్పారు. సముద్రం విజువల్స్ సోరెన్ గారు బాగా చూపించారు. అనిరుధ్ బీజియమ్స్, ప్రకాశ్ రాజ్ గారి పాత్ర గానీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. కోస్ట్ గార్డ్ ఫైట్స్ బాగున్నాయి. నాతో సహా అందరూ దర్శకుడిని బాగా నమ్మారు. ఎవరి పని వారు చేసుకుంటే పోతే సినిమా విజయవంతం అవుతుందని దేవర నిరూపించింది అని అన్నారు.
 
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, శివగారు కథ రాసినప్పుడు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో కష్టం కనిపించింది. మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నా తమ్ముడు, నాన్న కుమ్మేశావ్... క్లయిమాక్స్ లో పడే ఆవేదన బూజ్ బమ్స్ తీసుకువచ్చింది అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, ఎన్.టి.ఆర్. సినిమా అర్థరాత్రి ఒంటిగంటకే షోకు వెళ్ళాను. థియేటర్లలో పండుగ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసింది. వారి ఆదరణ చూశాక మరింత కసి పెరిగి మరిన్ని సినిమాలు చేయాలనుంటుంది. దేవర సినిమాకు అందరూ బాగా కష్టపడ్డారు. విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా వుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే టెంపోలో సాగుతుంది. దానికి శివ టీమ్ కు ధన్యవాదాలు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
 
జపాన్, చైనా, రష్యా వెళ్ళాను. అక్కడ తెలుగు సినిమాల గురించి చెబుతుంటే ఆశ్చర్యపోయాను. ప్రభాస్, చరణ్, ఎన్.టి.ఆర్.ను ఓన్ చేసుకున్నారు. ఇండియన్ సినిమా అంటేనే హిందీ అనేవారు. ఇప్పుడు తెలుగు సినిమా అనే రేంజ్ కు వచ్చేశారు. ఈ స్థాయికి తెచ్చిన దర్శకులకు, హీరోలకు క్రుతజ్నతలను తెలియజేసుకుంటున్నాను.