గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:56 IST)

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

Ruthwik - Ikra Idrisi
Ruthwik - Ikra Idrisi
రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘వైభవం’. సాత్విక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను విడుదల చేశారు. రుత్విక్ - ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్  స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా... రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తామ‌ని దర్శకనిర్మాతలు తెలిపారు.