గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (18:04 IST)

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌‌లో షట్లర్స్ అదుర్స్.. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం

Chirag-Satwik
Chirag-Satwik
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రికార్డు సృష్టించింది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్ డిసా, ప్రదీప్ గాంధే జోడీ కాంస్యం గెలిచాక మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత్ ఓ పతకం సాధించింది. 
 
చైనాలోని హాంగ్ ఝౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో స్వర్ణం చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-18, 21-16తో దక్షిణ కొరియా జంటపై గెలిచారు.  చోయి సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై అద్భుతంగా పుంజుకుని గేమ్‌ను సొంతం చేసుకున్నారు.
 
మొత్తమ్మీద 57 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.