బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (22:04 IST)

పాక్ పేసర్లు అదుర్స్.. క్రికెట్ చరిత్రలో 10 వికెట్లు పడగొట్టారు..

Pak Bowlers
Pak Bowlers
శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో రెండుసార్లు ఆటంకం కలిగించిన వర్షం..  ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మళ్లీ వర్షం కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారింది. దాంతో పాక్ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కానే లేదు. 
 
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. పేస్ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పాక్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్లను ఆటాడుకున్నారు. తద్వారా తొలిసారిగా పాక్ పేసర్లు వన్డే క్రికెట్ చరిత్రలో 10 వికెట్లు పడగొట్టారు. 
 
అఫ్రిది 4, నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3 వికెట్లతో సత్తా చాటారు. టీమిండియాలో హార్దిక్ పాండ్యా (87), ఇషాన్ కిషన్ (82)రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకోగలిగింది.