శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (18:48 IST)

ఎన్‌.టి.ఆర్‌. కుటుంబ స‌భ్యుల‌కోసం థియేట‌ర్ బుక్‌

Sandhya-RTc crosss roads
ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా రెండు రోజుల్లో విడుద‌ల‌కాబోతోంది. ఈ సంద‌ర్భంగా దాదాపు అన్ని ప్ర‌మోష‌న్స్ చేసేశారు. ఇక  ఈ సినిమాను చూసేందుకు అభిమానులు, ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. హైద‌రాబాద్‌లోని క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేట‌ర్‌లో ఇప్ప‌టికే బ్లీమ్లానాయ‌క్‌, రాధే శ్యామ్ సినిమాలు ఆడుతున్నాయి. కానీ వారంరోజుల‌నాడే ఈ థియేట‌ర్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌. క‌టౌట్ పెట్టేశారు. రాజ‌మౌళి, ఎన్‌.టి.ఆర్‌. రామ్‌చ‌ర‌ణ్ పేద్ద క‌టౌట్లు పెట్టి అల‌రిస్తున్నారు.
 
కాగా, ఎన్‌.టి.ఆర్‌. కుటుంబ స‌భ్యుల‌కోసం థియేట‌ర్ బుక్ చేసిన‌ట్లు తెలిసింది. మ‌ల్లీప్లెక్స్‌లోని ఓ స్క్రీన్‌ను త‌న‌కోస‌మే బుక్‌చేసిన‌ట్లు స‌మాచారం. స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కోసం బుక్ చేసిన‌ట్లు తెలిసింది.
ఇక ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రీమియ‌ర్‌లు వేస్తే దిల్‌రాజు హ‌డావుడి చేస్తున్నారు. ఒక్కో టికెట్ ఐదువేల‌కు అమ్మిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఎ.పి.లో ఆ ప‌రిస్థితి ఇంకా రాలేదు.