సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జులై 2023 (09:31 IST)

మనసును కదిలించే కథతో నాతో నేను తీశారు : సాయికుమార్‌

Natho nenu pre release
Natho nenu pre release
సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి. దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతొ నేను’. శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా  ప్రీ రిలీజ్‌ వేడుకగా వైభవంగా జరిగింది. 
 
సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేనీ స్థాయిలో ఉన్నాను. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డాను. తాజాగా నటించిన ‘నాతో నేను’ కూడా మంచి కథ. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. పాటలు, మాటలు అన్ని చక్కగా కుదిరాయి. నిర్మాత తన శక్తి దాటి ఖర్చు చేశారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. టీమ్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి కథ, మంచి టీమ్‌తో ఇంతవరకూ రాగలిగాం. ఈ చిత్రంలో ప్రతి సీన్‌ మనసును కదిలిస్తుంది. ఈ నెల 21 గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. దర్శకనిర్మాతలతోపాటు మా అందరికీ మంచి పేరు, లాభాలు తీసుకురావాలి’ అని అన్నారు. 
 
శ్రీనివాస్‌ సాయి మాట్లాడుతూ ‘‘చక్కని కథాంశంతో ఎమోషన్స్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. టీమ్‌ అంతా కష్టపడ్డాం. పాటలన్నీ చక్కగా కుదిరాయి. రెట్రో సాంగ్‌ తెరపై అదిరిపోతుంది. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం’’ అని అన్నారు. 
 
శాంతికుమార్‌ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందాను. కమెడీయన్‌గా ఉన్న నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నా నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్‌ ఆర్టిస్ట్‌ సాయికుమార్‌ కథ విని సరే అనగానే నేను సక్సెస్‌ అయ్యాననిపించింది. ఆదిత్యా ఓం కూడా అరగంటలో ఓకే చేశారు. నాకు బలమైన నా టీమ్‌ వల్లే ఈ సినిమాను ఇంతవరకూ వచ్చాం. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. 
 
‘‘చిన్న సినిమాగా మొదలుపెట్టాం. చక్కని కథకు అన్ని సమపాళ్లతో కుదరడంతో మా వరకూ పెద్ద సినిమాగా నిలిచింది. కరోనా వల్ల కాస్త డిలే అయింది. మంచి సమయంలో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన నటీనటులు, సాంకేతిక నిపుణులు, అతిథులు చిత్రం సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.