గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (06:35 IST)

ఓట‌మి జీర్ణించుకోలేని నాగ‌బాబు - ఇక సెలవు అంటూ ప్ర‌క‌ట‌న‌

Nagabbau
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ చేసిన ప్ర‌కాష్‌రాజ్ ఓడిపోవ‌డంతో పాటు ఆయ‌న పేన‌ల్‌లో కొంద‌రు ఓడిపోవండ‌పై నాగ‌బాబు జీర్ణించుకోలేక‌పోయారు. మొద‌టినుంచి ఆయ‌న ప్ర‌కాష్‌రాజ్‌ను ఎందుకు స‌పోర్ట్ చేస్తున్నామో అంటూ తెగ ప్ర‌చారం చేశారు. కేంద్రంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు వుంద‌నీ, మంచి చేయాల‌నుకున్నాడ‌నీ, ప్రాంతీయ త‌త్త్వం అనేది ఎన్నిక‌ల్లో అంశం తీసుకురావ‌డం క‌రెక్ట్ కాద‌ని చెబుతూ వ‌చ్చారు. అయితే నాగ‌బాబు మాట ఎవ‌రూ విన‌లేదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కేంద్రంలో ఆయ‌న మంచి సంబంధాలుంటే `మా`కు ఏమి సంబంధం అనే ప్ర‌శ్న‌కు? ఆయ‌న ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం లేదు. ఇదే విష‌యాన్ని ప‌లువురు ఆయ‌న ముందుంచితే కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేశరు కూడా.
 
ఇక ఎట్ట‌కేల‌కు ప్ర‌కాష్‌రాజ్ ఓడిపోవ‌డంతో నాగ‌బాబు అవ‌మానంగా భావించారు. సున్నిత‌మ‌న‌స్కుడైన ఆయ‌న ఈ ఓట‌మిని త‌న ఓట‌మిగా భావించాడు. అందుకే సోమ‌వారం ఉద‌య‌మే ఆయ‌న ట్విట్ట‌ర్‌లో త‌న స‌భ్య‌త్వానికి కూడా రాజీమానా చేస్తున్నానంటూ ప్ర‌క‌టించారు.
 
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో  కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్అ సోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో  "నాష‌  ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...సెలవు.
- నాగబాబు.