శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (17:54 IST)

బంగార్రాజు సెట్లో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి షురూ

Chaitu-Nag
ఇదివ‌ర‌కు అక్కినేని నాగార్జున‌. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అద్భుత‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సోగ్గాడే చిన్నినాయ‌న‌. ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున పెద్ద కొడుకు నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.  ర‌మ్య‌కృష్ణ కూడా ఇప్పుడు బంగార్రాజులోనూ న‌టిస్తున్నారు. కృతి శెట్టిని నాగచైత‌న్య ప‌క్క‌న ఫిక్స్ చేశారు మేక‌ర్స్. ఈ న‌లుగురు క‌లిసిన కాంబినేష‌న్ సీన్లు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని రిచ్ హౌస్‌లో వీరి కాంబినేష‌న్ చిత్రీక‌రిస్తున్నారు. బుధ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టారు.
 
రొమాన్స్, ఎమోష‌న్స్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అత్య‌ద్భుత‌మైన క‌ల‌యిక‌గా బంగార్రాజు హోల్‌స‌మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ ప్రాజెక్ట్ మీద హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి.  అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ స‌హ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో చ‌ల‌ప‌తిరావు, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 
 
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, మాట‌లు:  క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌,  నిర్మాత‌: అక్కినేని నాగార్జున‌, బ్యాన‌ర్స్:  జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌, స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌, సంగీతం:  అనూప్ రూబెన్స్,  కెమెరా:  యువ‌రాజ్‌.