గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (17:26 IST)

వాళ్ళ స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేః సుహాస్‌

Suhas
సుహాస్‌... క‌మెడియ‌న్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించిన త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని `క‌ల‌ర్ ఫొటో` సినిమాతో హీరోగా స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు హీరోగా, న‌టుడిగా బిజీగా ఉంటున్న సుహాస్ రైట‌ర్ ప‌ద్మ‌భూష‌న్ సినిమాలో న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు ఈనెల 19, గురువారం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
- మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. కలర్ ఫోటోతో హీరో అయ్యా. హీరోగా చేస్తూ... మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా మంచి క‌థ‌లు, పెద్ద సినిమాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆరు సినిమాలు చేస్తున్నాను. 
- ఇప్పుడు చేస్తున్న ఆరు సినిమాల్లో, ఐదింటిలో లీడ్ క్యారెక్ట‌ర్‌గా, మ‌రో సినిమాలో నార్మ‌ల్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. 
 
-  నేను షార్ట్ ఫిలింస్ చేస్తున్న‌ప్ప‌టి నుంచి నాతో ప‌రిచ‌యం ఉన్న ద‌ర్శ‌కుల‌తో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ముందు నుంచి అనుకున్నాం కాబ‌ట్టి వారితో ట్రావెల్ అవుతున్నాను. 
- నేను పని చేసిన దర్శకులందరూ, కలర్‌ఫొటో సినిమాకు వ‌చ్చి ఇలాగే మంచి క‌థ‌లు తీసుకుని సినిమాలు చెయ్య‌మ‌ని స‌ల‌హాలు ఇచ్చారు. 
- షార్ట్ ఫిలింస్ చేసేట‌ప్పుడు మంచి సినిమాలు రావాల‌ని చేశాను. మంచి సినిమాలు, పాత్ర‌లు వ‌చ్చిన త‌ర్వాత అవ‌న్నీ నాకు క‌ల‌ర్ ఫొటోకు హెల్ప్ అయ్యాయి. 
- హీరోగా చేసేట‌ప్పుడు చాలా భ‌యం ఉంటుంది. ప్రెష‌ర్ అయితే క‌చ్చితంగా ఉంటుంది. అదే క్యారెక్ట‌ర్స్‌లో చేసేట‌ప్పుడు మ‌న సీన్స్ వ‌ర‌కు న‌టిస్తే చాలు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న‌ ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. 
 
- డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌తో నాకు ఆరేళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. నా షార్ట్ ఫిలింకు రైట‌ర్‌గా వర్క్ చేశాడు. అలాగే క‌ల‌ర్ ఫొటో సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గానూ వ‌ర్క్ చేశాడు. త‌ను ఓ క‌థ అనుకుంటున్నాన‌ని, రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ క‌థ‌ను నెరేట్ చేశాడు. నాకు బాగా న‌చ్చింది. దాని గురించి చాయ్ బిస్క‌ట్ ప్రొడ‌క్ష‌న్ వారితో చెప్పాను. మంచి క‌థను ఇంకా బాగా చెబుతామ‌ని, మంచి బ‌డ్జెట్‌తో, ఆర్టిస్టుల‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాత‌లు సినిమా చేశారు. విజ‌య‌వాడ‌లోని మిడిల్ క్లాస్ కుటుంబంలో ఏం జ‌రుగుతుందనేదే రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ క‌థ‌. 
 
- నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలోని వారంద‌రూ నా స్నేహితులు. ల‌క్కీగా నా చుట్టూ ఉన్న‌వాళ్లెవ‌రూ మార‌లేదు. ఇంకా న‌న్ను బాగా చూపించాల‌ని స‌పోర్ట్ చేస్తున్న‌వారే. 
- ఇప్ప‌టి వ‌ర‌కు నా స్నేహితులతో క‌లిసి వ‌ర్క్ చేశాను. వారితో ప‌నిచేట‌ప్పుడు డిస్క‌ష‌న్స్ జ‌రిగేవి. అప్పుడు చిన్న చిత‌కా ఇన్‌పుట్స్ ఇస్తుండేవాడిని. డైరెక్ట‌ర్ అయ్యేంత లేదు. ఆ ప్రెష‌ర్ మ‌న వ‌ల్ల కాదు. 
- ఇండ‌స్ట్రీలో నాని అన్న‌, విజ‌యన్న‌, శివ‌న్న‌, నాగ‌చైత‌న్య‌గారు, స‌మంత‌గారు, బ్ర‌హ్మాజీగారు.. ఇలా అంద‌రూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అంద‌రూ స‌పోర్ట్ చేస్తున్నారు. 
 
- త‌ల్లిదండ్రులు, భార్య‌, స్నేహితులు .. ఇంత‌కు ముందుకంటే ఇప్పుడు కాస్త సెటిల్ అయ్యాన‌ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంట్లోవాళ్లు మ‌న స్ట్ర‌గుల్స్ నుంచి ఇస్తున్న స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అర్థం చేసుకునేవాళ్లు రాక‌పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది. త‌న‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింది. 
- రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఓ సాంగ్ మిన‌హా మిగ‌తాదంతా పూర్త‌య్యింది. అక్టోబ‌ర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. శేఖ‌ర్ చంద్ర‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ప్ర‌శాంత్ డైలాగ్స్ చ‌క్క‌గా రాసుకున్నాడు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.