ఫ్యామిలి డ్రామాలో సీరియల్ కిల్లర్ గా సుహస్
మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని కలర్‌ఫోటో లాంటి గ్రేట్ లవ్ స్టోరి లో తన నటనతో నవ్వించి కంట తడి పెట్టించిన సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఏక్ మిని కథ లాంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ని ప్రోడ్యూస్ చేసిన మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సైకొ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ప్లే ని మెహెర్ తేజ్, షణ్ముఖ ప్రసాంత్ లు అందిస్తున్నారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణ లాంటి చిత్రాలకి ఎడిటర్ గా పనిచేసిన రామకృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం లొ హీరోయిన్స్ గా పూజా కిరణ్, అనూషా నూతుల నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఫ్యామిలీ డ్రామా ఫస్ట్ లుక్ విశేష స్పందన రావడంతో పాటు వినూత్నంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావడమే కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం. అన్ని కమర్షియల్ అంశాలతో ఈ ఫ్యామిలీ డ్రామా రెడీ అయినట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది, మెహెర్ తేజ్ డైరెక్షన్ స్కిల్స్, సుహాస్ పెర్ఫార్మెన్స్ వెరసి ఫ్యామిలీ డ్రామాతో ఆడియెన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్ పీరియెన్స్ గ్యారంటీ అని నిర్మాతలు ఫుల్ కాన్ఫెడెంట్ గా చెబుతున్నారు. ముఖ్యంగా కలర్ ఫోటో చిత్రం తరువాత సుహస్ చేసిన చిత్రం గా ఫ్యామిలి డ్రామా రావటం.. టోటల్ కాంట్రాస్ట్ గా క్యారక్టర్ వుండటం, ఆడియన్స్ ని విపరీతం గా ఆకట్టకుంటుంది. సుహస్ గెటప్ కూడా కొత్తగా వుండటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా వుంది.